మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రంగురంగుల గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించారు. వివిధ రకాల గాజుల మధ్య అమ్మవారిని చూస్తున్న భక్తులు... భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.
ఆలయ అర్చకులు వేకువ జాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కరానా నేపథ్యంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్, అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే భౌతిక దూరం పాటిస్తూ... మాస్కు ధరించిన వారిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరగా పోవాలని ప్రార్థిస్తూ... అమ్మవారికి ప్రత్యేకు పూజలు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'