మెదక్ డీపీవో ఎం.హనూక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామాలకు ఇస్తున్న నిధులు సకాలంలో విడుదల చేయనందుకు చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ నిధులు ఆగస్టులో అందడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హనూక్‌ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నతాధికారులు ఎంత చెబుతున్నా... ప్రభుత్వ అధికారుల్లో కొందరి తీరు మారడం లేదు. గతంలో ఉపాధి హామీ పనుల్లో నిధులను పక్కదారి పట్టించిన అధికారులు అరెస్టయ్యారు. అయినా కూడా చట్టం ప్రకారం గ్రామాలకు అందాల్సిన నిధులను సరియైన క్రమంలో వినియోగించడం లేదు. తాజాగా ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఇదీ చూడండి : ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి