ETV Bharat / state

Dog Feeds lamb: ఆకలి తీర్చిన అమ్మతనం.. గొర్రెపిల్లకు పాలిచ్చిన శునకం - medak news

Dog Feeds lamb: మాతృత్వం చాటుకోవడానికి పేగు తెంచుకుని జన్మే ఇవ్వల్సిన అవసరం లేదు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలిస్తే చాలు. ఏ బంధంలోనైనా స్వార్థం ఉంటుందేమో కానీ.. ఒక్క అమ్మ పంచే ఆప్యాయతలోనే ఎలాంటి పక్షపాతం ఉండదు. అమ్మా అని పిలిస్తే చాలు.. కడుపున పుట్టకపోయినా కళ్లలో పెట్టుకుని చూసుకునేంత గొప్ప మనసు అమ్మది. అందుకే అన్ని బంధాల్లోకెల్లా గొప్ప బంధం తల్లితో బిడ్డకు పెనవేసుకున్న బంధం. మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే ఆ బంధం గొప్పతనం గురించి మనం మాట్లాడుకునేలా చేశాయి ఆ మూగజీవులు. అమ్మ అనే పదంలోని గొప్పదనాన్ని మరోసారి నిరూపించింది ఓ తల్లి శునకం.

Dog Feeds lamb
గొర్రెపిల్లకు పాలిచ్చిన శునకం
author img

By

Published : May 7, 2022, 2:09 PM IST

Dog Feeds lamb: సృష్టిలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. తాను ఆకలితో ఉన్నా.. బిడ్డ కడుపు నింపాలని అమ్మ ఆరాటపడుతుంది. తన కడుపున పుట్టకున్నా.. ఏ బిడ్డ ఆకలితో అల్లాడినా తల్లి మనసు తట్టుకోలేదు. అలాంటి మూర్తీభవించిన మాతృ ప్రేమను కళ్లారా మరోసారి చూపించింది ఓ శునకం.

గొర్రెపిల్లకు పాలిస్తున్న శునకం

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్​శెట్టిపల్లి గ్రామానికి చెందిన రవీందర్.. ఓ గొర్రె పిల్లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. దానికి తల్లి లేకపోవడంతో ఉదయం, సాయంత్రం... రెండు పూటలా ఆయనే పాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న సాయంత్రం పనిమీద రవీందర్ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. అప్పటికే యజమాని రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న గొర్రె పిల్లకు.. ఆయన ఇంకా రాకపోయేసరికి నిరాశకు గురైంది.

ఓ వైపు ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. మరోవైపు.. ఇంట్లో ఎవరైనా ఉన్నారా.. తన ఆకలి తీరుస్తారా..? అని చూస్తే.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇక చేసేదేం లేక యజమాని ఎప్పుడొస్తాడా..? తనకెప్పుడు పాలు పడతారా..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటమే తనవంతైంది. సమయం గడిచేకొద్దీ ఆకలితో గొర్రెపిల్ల నీరసించిపోయింది. డీలా పడిపోయిన గొర్రెపిల్ల అలా కూర్చుండిపోయింది. కాసేపటికి ఓ శునకం తనకెదురుగా కనిపించింది. అది తన పిల్లలకు పాలు పడుతోంది. ఇక అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిగెత్తుకుంటూ ఆ శునకం దగ్గరకు వెళ్లింది.

అయితే ఇక్కడ ఆ కుక్క.. నాకెందుకులే అని ఊరుకోలేదు. అమ్మ స్థానంలో ఉంది కదా.. ఆ గొర్రె పిల్ల ఆకలిని ఇట్టే పసిగట్టింది. అంతే తన చనుబాలను ఆ గొర్రెపిల్ల తాగుతుంటే.. కిమ్మనకుండా తన కడుపున పుట్టిన బిడ్డకు పాలిస్తున్నట్లుగా భావించింది. గారాబంగా దానిని దగ్గరకు తీసుకుని ఆ గొర్రె పిల్ల ఆకలి తీర్చింది. అప్పుడే ఇంటికి వచ్చిన రవీందర్​కు ఆ దృశ్యం కంటపడింది. ఆ తల్లిప్రేమకు కళ్లు చెమర్చి.. ఆ అద్భుత దృశ్యాన్ని తన చరవాణిలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇవీ చదవండి: Rahul tour Second day: రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​ గాంధీ..

యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.