మెదక్ జిల్లా నర్సాపూర్ సొషల్ ఫారెస్ట్ నర్సరీలో పని చేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. రెండు పడక గదులు నిర్మించటానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు కిరాణా సామగ్రి అందించారు. నర్సాపూర్ పట్టణంలో టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులందరూ సొంతంగా డబ్బులు పోగేసుకుని వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్యానాయక్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రావు, సామ్య నాయక్, నాగుల మీరా, అప్పల నాయుడు తదితరులు ఉన్నారు.
నర్సాపూర్‌లో వలస కార్మికులకు కిరాణా సామగ్రి పంపిణీ - టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల అందజేత
లాక్‌డౌన్ సమయంలో మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పేదలకు సరకులు అందిస్తే వారి ఆకలి తీర్చినవారమవుతామని తహసీల్దార్ మాలతి, సీఐ నాగయ్య అన్నారు.