ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి' - మెదక్​ జిల్లా తాజా వార్తలు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలికలో పనిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు రెస్సాన్సిబుల్‌ సిటిజన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Distribution of essentials to sanitation workers Dis
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి'
author img

By

Published : Sep 5, 2020, 2:07 PM IST

కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని రెస్సాన్సిబుల్‌ సిటిజన్స్‌ సంస్థ అధ్యక్షుడు వడ్డి బాబురావు పేర్కొన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్‌ పురపాలికలో పనిచేస్తోన్న 60 మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్‌, మాస్క్‌, నిత్యావసరాలను పంపిణీ చేశారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు నిత్యం విధులకు హాజరవుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని బాబురావు పేర్కొన్నారు. కరోనా వచ్చిన వీధుల్లో సైతం ఏమాత్రం జంకకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విధుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా బాబురావుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్ధాపక అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, చిక్కవెంకటేషం, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ మురళి, సంతోష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. మా సర్కారు పథకాలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.