Distribution of double bedroom houses: ఉచితాలు వద్దంటున్న మోదీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ది చెప్పాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ మున్సిపాలిటీ పరిధి పిల్లి కొట్టాల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇంళ్లను ప్రారంభించిన ఆయన పలువురు లబ్ధిదారులను గృహ ప్రవేశాలు చేయించి 561 ఇళ్ల పట్టాలను అందచేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లడిన ఆయన సబ్సిడీ మీద పేదలకు గ్యాస్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమని విమర్శించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టింది తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు.
కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయమంటే చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 60 వేలు ఇస్తే అందులో 40 వేలు అప్పెనన్నారు. మాఫీ అయ్యే 20 వేల రూపాయల కోసం మూడు సార్లు బ్యాంక్‌కి పోవాల్సి వచ్చేదని, అంతేగాక కాంగ్రెస్ నాయకులు లంచాలు తీసుకునేవారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తుందన్నారు. పేదల పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలని మంత్రి కోరారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీమ్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు.
ఇవీ చదవండి: