మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం సమావేశం ఏర్పాటు చేసి స్థానికులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. యువత మద్యం, ఫోన్లకు బానిసలై.. సమయాన్ని వృథా చేయొద్దని నర్సాపూర్ సీఐ నాగయ్య సూచించారు. అపరిచితులు ఫోన్ చేసి తమ సమాచారాన్ని అడిగితే ఇవ్వవద్దని అన్నారు. శాంతి భద్రతలను కాపాడడానికే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో నర్సాపూర్ ఎస్సై సత్యనారాయణ, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.