మెదక్ జిల్లాలోని ఎలాంటి అనుమతులు లేకుండా నర్సాపూర్ రాయరావు చెరువులో మట్టిని తరలించడాన్ని ప్రశ్నిస్తూ మత్స్యకారులు, ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. మత్స్య సహకార సంఘం నేతలు చెరువు వద్దకు చేరుకుని మట్టి తవ్వకాలు చేపట్టకుండా అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. అనుమతులు లేకుండానే సోమవారం రాత్రి నుంచి రెండు భారీ హిటాచీ యంత్రాలతో మట్టిని తవ్వుతూ వందల లారీల్లో నల్లమట్టిని మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ ఇటుక బట్టీలకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణ అభివృద్ధి పేరిట చెరువును ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పూడికతీత పనులు చేపట్టడం వల్ల స్థానికులు అడ్డుకున్నారు. రాయరావు చెరువును సంరక్షించాలని కోరుతూ ఆర్డీవో బండ అరుణారెడ్డి, తహసీల్దార్ మాలతి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్‌లకు వినతిపత్రాలు సమర్పించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర