ETV Bharat / state

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు - cm relief fund cheques distributed in medak district

మెదక్​లో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ శేరి సుభాష్​ అందించారు. 30 మందికి రూ.19.8 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

cm relief fund cheques distributed to beneficiaries
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
author img

By

Published : May 16, 2021, 7:42 PM IST

మెదక్​ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో 30 మందికి రూ.19.8 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నిబంధనల వల్ల సమీప గ్రామాల్లోని లబ్ధిదారులకు మాత్రమే ప్రస్తుతం చెక్కులు అందించామని… మిగతా వారికి తన వ్యక్తిగత సిబ్బంది ఇంటికే వచ్చి అందిస్తారని తెలిపారు. ప్రైవేటులో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా సాయం అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆపద కాలంలో తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూచన్ పల్లి సర్పంచ్ దేవగౌడ్, మాజీ సర్పంచ్ కిరణ్ గౌడ్, ఉప సర్పంచ్ భయ్యన్న, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.