ETV Bharat / state

'వ్యవసాయం, ఆదాయాన్ని.. అంబానీలకు అప్పజెప్పే యత్నం'

నూతన వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు.. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఆమోదించిందని ఏఐసీసీ ఇన్​ఛార్జ్ బోస్​ రాజు ఆరోపించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెదక్​లో క్రిస్టల్​ గార్డెన్​ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్​ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రాజధాని దిల్లీలో 50 రోజులుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిరసన చేస్తున్న రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

aicc rally, new agri acts, medak
ఏఐసీసీ, మెదక్​, ర్యాలీ, నూతన చట్టాలు
author img

By

Published : Jan 11, 2021, 6:05 PM IST

రైతుల క్షేమం కోసం నూతన వ్యవసాయ బిల్లులు ఆమోదించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్రం చట్టాలను చేసిందని ఏఐసీసీ ఇన్​ఛార్జ్ బోస్ రాజు ఆరోపించారు. కేవలం 24 గంటల్లో రాష్ట్రపతి ఆమోదంతో దేశంలో జారీ చేసిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ మెదక్​ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన సోమవారం క్రిస్టల్ గార్డెన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాం

చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో 50 రోజులుగా రైతులు ధర్నా చేస్తున్నారని.. ఇప్పటివరకు 60 మంది చనిపోయారని బోస్​రాజు తెలిపారు. ఎటువంటి పరిశీలన లేకుండా రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను తీసుకు రావడం సరికాదన్నారు. గత నెల 23న 'కిసాన్ సెల్' ఆధ్వర్యంలో దేశంలో 2కోట్ల మంది రైతులతో సంతకాల సేకరణ చేసి రాహుల్ గాంధీ నేతృత్వంలో.. వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. వ్యవసాయాన్ని, ఆదాయాన్ని అంబానీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు 7 సార్లు సమావేశమైనా.. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రైతుల మీద గుదిబండలా..

లాక్​డౌన్​ సమయంలో జూన్​లో ఆర్డినెన్స్ ద్వారా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద కేంద్రం పెద్ద గుడిబండ వేసిందని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 10 శాతం మంది రైతులు కూడా ధాన్యాన్ని మార్కెట్​కు తీసుకువెళ్లడం లేదని.. దళారులే గ్రామాల్లోకి వచ్చి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దూరప్రాంతాలకు ధాన్యాన్ని తరలిస్తే రవాణా ఖర్చుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ర్యాలీలో మెదక్ పార్లమెంట్ ఇన్​ఛార్జ్ అనిల్ కుమార్, కాంగ్రెస్​ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.