మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశాన్ని మందమర్రి మండలం క్యాతన్‌పల్లిలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆ ఏరియాల్లో ఐసోలేషన్ కేంద్రాలు...
జిల్లాలో నెలకొన్న పలు సమస్యల గురించి సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులు చర్చించారు. అనంతరం జిల్లాలో పెరుగుతున్న కొవిడ్ బాధితులను తగ్గించేందుకు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల శాసన సభ్యుల నిధుల నుంచి మూడు ప్రత్యేక అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడించారు. పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, మాస్క్‌లను ధరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి సూచించారు.
ఇవీ చూడండి : విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి: ప్రభాకర్‌రావు