గోదావరి పడవ ప్రమాదంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు వెంటనే ఘటనాస్థలికి బయలుదేరారు. గతరాత్రి కర్ణమామిడికి చెందిన లక్ష్మణ్ మృతదేహం లభించింది. నన్నూరుకు చెందిన మరో ఇంజినీర్ రమ్యశ్రీ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంజినీర్ల దినోత్సవం రోజునే ఇద్దరు యువ ఇంజినీర్లు ప్రమాదానికి గురవ్వడంపై తోటి ఇంజినీర్లు విచారం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : పడవ మునగడానికి 5 నిమిషాల ముందు...