కార్మికులు కోల్పోయిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో తిరిగి ఇప్పించిన ఘనత తెరాస పార్టీదేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతతో పాటు పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదాయపన్నుతో కార్మికులు 2 నుంచి 4 నెలల వేతనాన్ని కోల్పోతున్నారని.... మినహాయింపు కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలిపారు. కేంద్రంలో ఆ బిల్లు ఆమోదం పొందాలంటే తెరాస ఎంపీల తోనే సాధ్యమవుతుందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారానికి గడువు ఇంకా 48 గంటలే..