సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థునుల ధర్నా ప్రధానోపాధ్యాయురాలి బదిలీని రద్దుచేయాలని విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాల (వసతిగృహం) ప్రిన్సిపల్ సుభాషిణి ఆకస్మిక బదిలీకి నిరసన తెలిపారు. పాఠశాల ప్రధాన ద్వారం ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. ఆమె విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవని.. నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా