ETV Bharat / state

'నాన్న చెప్పారు.. యూనిఫాం ఉద్యోగం చేయాలని'

గురుకులాల సంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిని వాయు సేనకు అధికారిగా ఎంపికై సత్తా చాటింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి భారత వాయుసేనలో అధికారిణిగా విధులు నిర్వహించే స్థాయికి ఎదిగింది. గురుకులాల నుంచి ఎంపికైన మొదటి విద్యార్థినిగా చరిత్ర సృష్టించింది బెల్లంపల్లి పట్టణం బాబుక్యాంపు బస్తీకి చెందిన చాముండేశ్వరి దేవి.

Indian airforce
chamundeswary
author img

By

Published : Apr 16, 2021, 2:10 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబుక్యాంపు బస్తీకి చెందిన గోపు విజయ్​కుమార్​, శారద దంపతులకు చాముండేశ్వరిదేవి, కపిల్​కుమార్​ సంతానం. యూనిఫాం ఉద్యోగం సాధించాలని తండ్రి తరచూ చెబుతుండటంతో అదే చెవికెక్కించుకున్న కూతురు చదువులోను ముందుండేది. పది వరకు బెల్లంపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 9.2 జీపీఏ సాధించింది. ఇంటర్​ హైదరాబాద్​లో చదివి 965 మార్కులు పొందింది. అనంతరం మంచిర్యాల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో సీటి సాధించింది. ఈ సమయంలోనే గురుకులాల సంస్థ కొత్తగా సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా సైనిక (ఆర్మీ) డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థినులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

కళాశాలలో చదువుతున్నరోజుల్లో
కళాశాలలో చదువుతున్నరోజుల్లో

మొదటి ప్రయత్నంలోనే..

రాతపరీక్షతో పాటు ఇతర పరీక్షల్లో నెగ్గి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని సాంఘిక సంక్షేమ సాయుధ దళాల శిక్షణ కళాశాలలో సీటు దక్కించుకుంది. చివరి సంవత్సరం చదువుతుండగానే ఏఎస్పీజీ (ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు) పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ముఖాముఖిలో ప్రతిభ చాటింది. వాయుసేనలో అధికారిణిగా ఎంపికై అందరి మన్ననలు పొందుతుంది.

కుటుంబంతో చాముండేశ్వరి దేవి
కుటుంబంతో చాముండేశ్వరి దేవి

మలుపు తిప్పిన తండ్రి ఆలోచన..

తండ్రి పదో తరగతి వరకు కూడా చదువుకోలేదు. కుమురంభీం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ద్విచక్రవాహనం షోరూంలో ఫైనాన్స్ కలెక్షన్ ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే యూనిఫాం ఉద్యోగమంటే ఇష్టపడే అతను ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే మానేశాడు. పిల్లల ద్వారా ఆ కోరికను తీర్చుకోవాలని వారిని చదివించాడు. ఈ సమయంలో కుమార్తె చాముండేశ్వరి వాయ సేనకు ఎంపికవ్వడం అతని ఆనందానికి అవధులు కేకుండా పోయాయి.

ఇదీ చూడండి: ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.