మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ బొగ్గు గనులు, కార్మికులు లేక వెలవెలబోతున్నాయి. బొగ్గు పరిశ్రమలలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన ఒక్క రోజు సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విధులకు హాజరుకాకుండా కార్మికులందరూ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇప్పటికైనా విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు