సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు సింగరేణి ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ బలరాం స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే వన్ డిస్పెన్సరీని పరిశీలించారు. ఇక్కడ కార్మికులకు అందిస్తున్న వైద్యం సంబంధించిన వివరాలను మందమర్రి ఏరియా జీఎం శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో నిత్యం 200 మంది కార్మికులకు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బలరాం తెలిపారు. తద్వారా కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మరికొంత మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్