మంచిర్యాల వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఒకటో, రెండో పట్టణాలకు అనుసంధానంగా రైల్వే పైవంతెన నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు ఈ పూజలో పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని రెండో నగరమైన హమాలివాడ, గోపివాడ, భగవతం వాడ, వేములపల్లి ప్రజలు రైలు గేటు వల్ల నానా ఇబ్బందులు పడతారు. నిత్యం కనీస అవసరాల కోసం మంచిర్యాల మార్కెట్కు రావడానికి చాలా సమయం గేటు వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
గేటు వద్ద పడిగాపులు పడే ఇబ్బందులను తొలగించేందుకు 10 కోట్ల వ్యయంతో ముకరం చౌరస్తా నుంచి హమాలివాడ లక్ష్మీ గణపతి దేవాలయం వరకు రైల్వే వంతెన నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయితే మంచిర్యాల రెండవ పట్టణ వాసుల కష్టాలు దూరమవుతాయి.
ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు