ETV Bharat / state

Pranahitha Pushkaralu 2022: 'లాంఛనంగా ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం' - Minister Indra karan reddy news

Pranahitha Pushkaralu 2022: ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జరిగే తొలి ప్రాణహిత పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుణ్య స్నానం ఆచరించారు.

Pranahitha
Pranahitha
author img

By

Published : Apr 13, 2022, 4:31 PM IST

Updated : Apr 13, 2022, 8:31 PM IST

'లాంఛనంగా ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం'

Pranahitha Pushkaralu 2022: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత నదికి తొలిసారిగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌తో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్‌ పుణ్యస్నానం ఆచరించారు. ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. 12 రోజుల కార్యక్రమం కావడంతో శాశ్వత ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.

మంత్రిగా కృష్ణ, గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనే అదృష్టం దక్కిందని ఇంద్రకరణ్‌ రెడ్డి వివరించారు. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద పవిత్ర మంత్రోచ్ఛరణల మధ్య నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పాలనాధికారి రాహుల్ రాజ్, అదనపు పాలనాధికారి వరుణ్ రెడ్డి... నదికి హారతి ఇచ్చి పుణ్యస్నానం ఆచరించారు.

ప్రాణహిత పుష్కరాల డ్రోన్ విజువల్స్

కాళేశ్వరంలోనూ: త్రివేణి సంగమంగా పిలిచే కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు మెుదలయ్యాయి. ఆలయం నుంచి తీసుకెళ్లిన పూర్ణ కలశాలతో మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాలకు అర్చకులు పుష్కరుడి ఆవాహన కార్యక్రమం నిర్వహించారు. పంచ కళశాలతో పుష్కరుడికి ఆహ్వానం పలికిన అర్చకులు... ప్రాణహిత నదికి సారె చీర, ఒడి బియ్యం, పూలు, పండ్లు, పూజ ద్రవ్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా పుణ్యస్నానం ఆచరించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు... ప్రభుత్వాలని పలు సూచనలు చేశారు.

కుమురం భీం జిల్లాలోని తుమ్మిడిహెట్టి నుంచి ప్రారంభమయ్యే ప్రాణహిత నది మంచిర్యాల జిల్లా మీదుగా సుమారు 113 కిలోమీటర్లు ప్రవహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం సమీపంలోని గోదావరిలో కలుస్తుంది. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్​ నుంచి రోజుకు రెండు లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహరాష్ట్రలోనూ సిరోంచ వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం

భార్యపై అనుమానం.. నాలుగేళ్ల పాటు బంధించి చిత్రహింసలు

Last Updated : Apr 13, 2022, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.