రాష్ట్రంలో పిల్లలకు అంగవైకల్యం రాకుండా ఉండేందుకే పోలియో చుక్కల కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖాధికారి నీరజతో కలిసి ప్రారంభించారు.
పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కోసమే ఆరోగ్యశాఖ కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా వ్యాప్తంగా 510 కేంద్రాలలో 75,587 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డాక్టర్ నీరజ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రేపటి నుంచి ఇంటింటికీ తిరుగుతూ ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేస్తామని అన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలియో చుక్కల మందు వేయించాలని ఆమె కోరారు.