మంచిర్యాల జిల్లా పోలీస్స్టేషన్లో పచ్చదనం కోసం ఆవరణలో సిబ్బందితో కలిసి సుమారు 100 మొక్కలను డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏసీపీ గౌస్ బాబా మొక్కలు నాటారు. 5వ విడత హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ తమ వంతుగా మొక్కలను నాటి సంరక్షణ చేస్తామని డీసీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో అడవుల శాతం తగ్గి పోయిందని, పర్యావరణానికి ఎంతో చేటు జరుగుతుందన్నారు. మళ్లీ మొక్కలు నాటి అడవులను సంరక్షిస్తే కాలుష్య రహిత పర్యావరణంగా మార్పు చెందుతుందన్నారు. చెట్లను పెంచడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఎద్దుల ప్రాణం తీసిన స్తంభం... శోకసంద్రంలో కుటుంబం