ETV Bharat / state

ప్లాస్మా సంచులు.. ఐస్​క్రీమ్​ పార్లర్లకు తరలిపోతున్నాయి! - రెడ్​క్రాస్​

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రక్తనిధి కేంద్రం అక్రమాలకు చిరునామాగా మారింది. రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధిలో సేకరించిన ప్లాస్మా సంచులు గుట్టు చప్పుడు కాకుండా ఐస్​క్రీమ్​ పార్లర్​ తరలించడం వివాదాస్పదమయింది.

plasma packets golmal in manchiryal red cross center
ప్లాస్మా సంచులు.. ఐస్​క్రీమ్​ పార్లర్లకు తరలిపోతున్నాయి!
author img

By

Published : Jul 30, 2020, 10:14 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం అక్రమాలకు చిరునామాగా మారుతోందని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్​ సంస్థ ద్వారా సేకరించిన ప్లాస్మా నిబంధనలకు విరుద్ధంగా ఐస్​క్రీమ్ పార్లర్​కి తరలించడం వివాదాస్పదమైంది. రక్తనిధి కేంద్రంలో మైనస్​ 40 డిగ్రీల నుంచి మైనస్​ 80 డిగ్రీల స్థాయిలో ఉన్న కూల్ ఫ్రిజ్​లో భద్రపరచిన ప్లాస్మా ప్యాకెట్లను రక్తనిధి కేంద్రం యజమాన్యం పట్టణంలోని ఐస్​క్రీమ్ పార్లర్​కు తరలించింది. ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లగా.. ప్లాస్మా సంచులు ఉంచిన ఫ్రిజ్​ను తిరిగి రక్తనిధి కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలిసింది.

2014 నుంచి ఇక్కడ ప్లాస్మా సేకరిస్తున్నారు. ఒక్కో ప్లాస్మా ప్యాకెట్​ను దాదాపు 550 రూపాయలకు అమ్ముతారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా కొంతకాలంగా ప్లాస్మా సంచులను బయటకు తరలించి అక్రమంగా అమ్ముతున్నట్టు స్థానికులు, రోగులు ఆరోపిస్తున్నారు. రక్తనిధి కేంద్రంలో ఉన్న ఫ్రిజ్​లు చెడిపోయినా మరమ్మతులు చేయించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై డ్రగ్ ఇన్​స్పెక్టర్​ను వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. రక్తనిధి కేంద్రంలో ప్లాస్మా ను అక్రమంగా అమ్మడం లేదని రెండు ఫ్రిజ్​లు ఉంటే అందులో ఒకటి సరిగా పనిచేయకపోవడంక వల్ల రక్తనిధి కేంద్రం సభ్యునికి చెందిన ఐస్​క్రీమ్ పార్లర్​లో ప్లాస్మా ప్యాకెట్లు భద్రపరచినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.