లాక్డౌన్ ప్రారంభమైన రోజు నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతినిత్యం అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. స్వయంగా ఆయన చేతితోనే ప్రజలకు భోజనం వడ్డించారు. నెలరోజులుగా తిండికి గతిలేని ప్రజల ఆకలి తీరుస్తున్న కౌన్సిలర్లను అభినందించారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే దివాకర్ రావు సూచించారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలిపారు. ఆకలితో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సాయం చేయాలని దివాకర్ రావు కోరారు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు