క్రిస్మస్ పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కానుకలను నిరుపేద క్రైస్తవులకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.. మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. నిరుపేద ప్రజలు సంతోషంగా తమ పండుగలు జరుపుకునేలా కానుకలను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే క్రైస్తవులకు 'క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్' పేరుతో కానుకలిస్తున్నాం. -దివాకర్ రావు, ఎమ్మెల్యే