మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామంలో షేక్ సల్మా హత్య కలకలం రేపింది. దేవపూర్కి చెందిన సల్మాతో పులిమడుగు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కమలాకర్‌తో పరిచయం ఏర్పడింది. క్రమంగా ప్రేమగా మారి.. శారీరక సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువకునితో సల్మాకు వివాహం కుదిరింది. ఆ తర్వాత కూడా సల్మా కమలాకర్‌తో సంబంధం కొనసాగించింది. పెళ్లి కంటే ముందే మరో యువకుడితో సంబంధం ఉందని తెలుసుకున్న సల్మా భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు.
అప్పటి నుంచి సల్మా తాను ప్రేమించిన యువకుడితో కొన్ని నెలలుగా రామకృష్ణాపూర్లో కలిసి ఉంటోంది. సోమవారం రాత్రి కమలాకర్, సల్మా మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన కమలాకర్ చేతికి అందిన పదునైన ఆయుధంతో సల్మా గొంతుకోసి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న రామకృష్ణాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?