మంచిర్యాలలోని ఆర్పీ రోడ్డు పరిసరాల కాలనీవాసులు మందు బాబులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోర్ సూపర్ మార్కెట్కు ఎదురుగా ఉన్న శ్రీనివాస వైన్స్ పక్కన సీసీ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి మందు కొడుతున్నారు. దీంతో కాలనీవాసులు బయటికి వెళ్లాలంటేనే భయమైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: రొమాంటిక్ క్రైమ్ స్టోరీ.. తల్లి ఫేస్బుక్ స్నేహానికి ఐదేళ్ల కూతురు బలి