మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలు తెరాస పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదరించి తమ అభ్యర్థులను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే దివాకర్‌రావు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా కృషిచేయాలని కౌన్సిలర్లకు సూచించారు.
లక్షెట్టిపేట, నస్పూర్, మంచిర్యాల మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గంతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు విస్మరిస్తే పుర ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.
ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ