తమ తండ్రి ఎన్నికల్లో విజయం సాధిస్తే నడచుకుంటూ గూడెం రమాసత్యనారాయణ స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారులు మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు రంజిత్ తన సోదరుడు విజిత్తో కలిసి ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని దండ పళ్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు... తన తండ్రితో పాటు తెరాస నేతలందరికీ శక్తిని ఇమ్మని దేవుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కుమారులు తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట స్థానిక తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన