ETV Bharat / state

మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం.. సస్పెండ్ చేయాలని కేటీఆర్‌ ఆదేశాలు

KTR : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌ వ్యవహారంపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకోఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేటీఆర్‌
కేటీఆర్‌
author img

By

Published : Jul 29, 2022, 9:40 PM IST

Updated : Jul 29, 2022, 10:44 PM IST

భారీ వర్షాల కారణంగా మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని ​.. పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన సూచించారు. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

అంతకు ముందే మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పుట్టినరోజు వేడకలకు హజరుకావాలని మున్సిపల్ సిబ్బందికి వాట్సాప్ గ్రూపులో సందేశం పంపించారు. ఈ కార్యక్రమంకు సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్, బిల్ కలెక్టర్ శ్రవణ్​లు గైర్హాజరయ్యారు. దీంతో నలుగురు సిబ్బందికి కమిషనర్ మెమో జారీ చేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నాయకులు కమిషనర్​కి కేటీఆర్ అంటే ఇంత అభిమానమా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

సస్పెండైన మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్
సస్పెండైన మున్సిపల్ కమిషనర్​ జి.గంగాధర్

ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజు ఆ అధికారిని సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదకగా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆయన తప్పు దిద్దుకోవడానికి మరో ప్రకటన విడుదల చేసినప్పటికీ.. మంత్రి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈ మెమోల జారీ విషయంలో సదరు అధికారిని కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. మెమోలు జారీ చేస్తే ఏమికాదనే భరోసాను వారు ఇవ్వడంతో కమిషనర్ జారీకి సమ్మతించినట్లు సమాచారం. మంత్రి కేటీఆరే స్వయంగా కమిషనర్​ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు.

  • I am the last person to encourage sycophancy in politics or administration

    Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦‍♂️

    Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour

    — KTR (@KTRTRS) July 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్​లో ఉండగానే ముమ్మారు తలాక్!'

700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ

Last Updated : Jul 29, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.