పేదల కోసం పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కిరాణాషాపు నిర్వాహకుడి వద్ద అక్రమంగా నిల్వ చేసిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పేదల కోసం పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్రకు అధిక ధరకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడులు జరిపామని టాస్క్ఫోర్స్ సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి : జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం