ETV Bharat / state

MLA Etela Rajender : 'ధర్నాచౌక్​ వద్దన్న వాళ్లే ధర్నాలు చేస్తే ఎలా?' - మంచిర్యాలలో ఈటల పర్యటన

తెలంగాణ ప్రభుత్వం(telangana government) ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఇంటికి 10 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి ఒట్టు పెట్టించుకున్నా.. ప్రలోభాలకు లొంగకుండా హుజూరాబాద్ ఓటర్లు నిజాయతీగా తనకు ఓటు వేశారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzurabad MLA etela rajender) అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రజలు తమ హృదయాల్లో ఉన్న నాయకులకే పట్టం కడతారని ఈ ఉపఎన్నిక నిరూపించిందని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా మంచిర్యాల జిల్లాలో పర్యటించారు.

MLA Etela Rajender
MLA Etela Rajender
author img

By

Published : Nov 18, 2021, 10:11 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో ఘన విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA etela Rajender).. మొదటిసారిగా మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈటలకు జిల్లా భాజపా శ్రేణులు శ్రీరాంపూర్​లో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీలో అంబేడ్కర్ విగ్రహానికి ఈటల, మాజీ ఎంపీ వివేక్ పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న భాజపా శ్రేణులు, మహిళలు మంగళహారతులతో వారిని స్వాగతించారు. జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు, జిల్లా నాయకులు.. ఈటలను ఘనంగా సన్మానించారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్.. ప్రజల సమస్యలు చెప్పుకునే ధర్నా చౌక్ (CM KCR banned Dharna Chowk)​ను నిషేధించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో కూర్చోవడానికి సిద్ధమయ్యారని ఈటల విమర్శించారు. ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఊదరగొట్టి.. ఇప్పుడు కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడమేంటని నిలదీశారు. కేసీఆర్ తాను ప్రవేశపెట్టిన పథకాలన్ని కేంద్ర సర్కార్​ను అడిగే పెట్టారా అని అడిగారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election) నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. పాలించే ప్రభుత్వమే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం(telangana government) ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఇంటికి 10 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి ఒట్టు పెట్టించుకున్నా.. ప్రలోభాలకు లొంగకుండా హుజూరాబాద్ ఓటర్లు నిజాయతీగా తనకు ఓటు వేశారని ఈటల రాజేందర్(Huzurabad MLA etela rajender) అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రజలు తమ హృదయాల్లో ఉన్న నాయకులకే పట్టం కడతారని ఈ ఉపఎన్నిక నిరూపించిందని తెలిపారు.

ఈనెల 10న శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్​ఆర్​పీ3వ గనిలో ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఈటల రాజేందర్(etela rajender) పరామర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్న కేసీఆర్.. ఆ నలుగురు చనిపోతే కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్​తో పాటు అదనంగా కోటి రూపాయలు పరిహారం(etela demands to pay deceased singareni labor one crore as compensation) చెల్లించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి యాజమాన్యాని(Singareni)కి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 లక్షల పరిహారమంటూ వాళ్లు చెప్పడం మభ్యపెట్టడమే గానీ.. అందులో నిజం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన కుటుంబాలను మంత్రులు ముఖ్యమంత్రి పరామర్శించి.. భరోసానివ్వకపోవడం బాధాకరమని ఈటల అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.