మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ధాన్యం తడిసింది. గాలివాన బీభత్సానికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి.
ట్రాఫిక్ పోలీసులు రహదారులపై ప్రజా రవాణా పునరుద్ధరణ కోసం సహాయ చర్యలు చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా పడిఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్ సమస్యకు అంతరాయం కలగకుండా చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.