మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లను గంటసేపు నిలిపివేశారు. కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ నుంచి కరీంనగర్‌కి వెళ్లే పుష్ఫుల్ను సుమారు గంటపాటు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీనివల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించడంతో రైళ్లు నడిచాయి.
ఇవీ చూడండి;వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం