కొవిడ్ వైరస్ నివారణ టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం వహించకుండా రెండో డోస్ పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీ ఛైర్మన్ నల్ల భాగ్యలక్ష్మితో కలిసి ఆయన టీకాను ప్రారంభించారు.
వ్యాక్సిన్ వేసుకున్న వైద్య సిబ్బందిని సుమన్ అభినందించారు. టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావం లేకపోవడం శుభపరిణామమని అన్నారు. అందరూ ధైర్యంగా ఈ టీకాను తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: వైన్స్ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది