మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బట్వాన్‌పల్లికి చెందిన ఓ యువకుడు అత్యుత్సాహాంతో ఓటేసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను చరవాణిలో ఫొటో తీశాడు. వాటిని సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కావటం వల్ల ఎన్నికల అధికారులు స్పందించారు. ఫొటోలు ఎవరు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారో అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే చరవాణిని పోలింగ్ కేంద్రంలోకి ఎవరు అనుమతించారనే దానిపై కూడ విచారణ కొనసాగుతోంది.
ఇవీ చూడండి: పుత్తడి కొనుగోళ్ల ఉత్సాహం అక్షయ తృతీయ వైభవం