ETV Bharat / state

ఫోన్​ కావాలా?... అయితే రెండు బీర్లు తీసుకురా... - suspend

రాత్రివేళ ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారు. కానీ ఓ కానిస్టేబుల్​ తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఓ యువకుడి ఫోన్​ తీసుకున్న కానిస్టేబుల్ దానిని తిరిగి ఇచ్చేందుకు రెండు బీర్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు.

పోలీస్ సస్పెండ్
author img

By

Published : May 29, 2019, 6:20 PM IST

మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్ శ్రీధర్ రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ఓ మైదానంలో నలుగురు యువకులు కనిపించారు. వారి వద్దకు వస్తున్న కానిస్టేబుల్​ని చూసి భయంతో తమ సెల్​ఫోన్​ అక్కడే వదిలేసి పారిపోయారు. కాసేపటి తర్వాత తమ ఫోన్​కు కాల్​ చేసి ఇవ్వాలని అడిగారు. 'రెండు బీర్లు తీసుకొచ్చి మొబైల్​ తీసుకెళ్లండి' అని శ్రీధర్ సమాధానం చెప్పాడు. ఈ తతంగాన్ని ​రికార్డు చేసిన యువకులు సామాజిక మాధ్యమాల్లో ఆడియోను పోస్ట్ చేశారు.

పోలీస్ సస్పెండ్
ఈ విషయం కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దీనిపై స్పందించి కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా... అసభ్యంగా మాట్లాడినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Intro:TG_ADB_12_29_BEERS BRIBE POLICE SUSPEND_AV_C6

Body:వి జువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది గమనించగలరు

కొందరు పోలీసు లు ప్రవర్తిస్తున్న తీరు పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉంది .మంచిర్యాల జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బీరు తెస్తే సెల్ ఫోన్ ఇస్తా అని డిమాండ్ చేశారు . దీంతో ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ బ్లూ కోట్ లో పనిచేస్తున్న
కానిస్టేబుల్ శ్రీధర్ రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తుండగా పట్టణంలోని ఓ మైదానంలో నలుగురు యువకులు సెల్ఫోన్ చూస్తూ కనిపించారు. కానిస్టేబుల్ రాకను చూసి ఆ యువకులు తమ సెల్ఫోన్లో అక్కడే వదిలేసి పారిపోయారు కాసేపటికి ఆ యువకులు తమ సెల్ ఫోన్ కి ఫోన్ చేయగా కానిస్టేబుల్ ఫోన్ పత్తి తమకు కావాలని అడగడంతో ఆ కానిస్టేబుల్ రెండు బీర్లు తీసుకురావాలని డిమాండ్ చేశాడు.దీంతో ఆ యువకులు రికార్డు చేసిన ఆడియోను సామాజిక మాధ్యమాలలో ఆడియోను పోస్ట్ చేశారు.
పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దీనిపై స్పందించి కానిస్టేబుల్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు . ఎవరైనా పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజలతో అసభ్యంగా మాట్లాడిన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.