పేదింటి ఆడపడుచుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలను పేద మహిళలు ఘనంగా జరుపుకోవాలనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఇవీ చూడండి: బస్సు టైర్ పంచర్.. మెట్రో పిల్లర్‌కు ఢీ