ETV Bharat / state

మలిదశ మమతానుబంధం

ఏడడగులు నడిచి ఏకమైన బంధం... మలి దశలో మండుటెండలో నీడై నిలిచింది. సెగలు గక్కుతున్న రోడ్డుపై కనులు కనిపించని భర్తకు చూపుతానై అనుబంధపు బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఆ ఇళ్లాలు. కాళ్లకు చెప్పులు లేకున్నా... కంటికి రూపం కానరాకున్నా... భాగస్వామి చేయి పట్టుకుని అడుగులేస్తోంది ఆ బంధం. అనుబంధం ముందు పేదరికం కానరాదని నిరూపిస్తూ సాగిపోతోంది.

former sarpanch lingayya, human interest story
manchirial news, old sarpanch
author img

By

Published : Mar 30, 2021, 1:16 PM IST

సమర్థంగా పనిచేసిన రాజకీయ నాయకులకు పేరు గొప్ప ఆస్తి అనే ఆయనే నిదర్శనం. ఒకప్పుడు గ్రామ సర్పంచ్​గా రెండు పర్యాయాలు చేసిన వ్యక్తి నేడు కటిక పేదరికంలో ఉన్నాడు. సమర్థంగా పని చేసిన రాజకీయ నాయకులకు పేరు తప్ప కాసులు కూడబెట్టుకోరు అనే మాటకు ఆయనే ఉదాహరణ.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ పంచాయతీకి తొలి సర్పంచ్​గా ఎన్నికైన ఏస్కూరి లింగయ్య. 1981 నుంచి వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు అందినంత సంపాదించుకునే వాళ్లనే ఎక్కువగా చూస్తున్నాం. ఈయన మాత్రం అలా కాదు. సమర్థంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు.

పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లిగయ్యకు కళ్లు పూర్తిగా కనిపించవు. అతని భార్య భూమక్క అన్ని చూసుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను మీదనే ఆధారపడి బతుకుతున్నారు. బిడ్డకు పెళ్లి చేసి పంపించారు. ఉన్న ఒక కొడుకుకు ఇంకా పెళ్లి కాలేదు. వ్యవసాయ కూలి పనులకు వెళుతుంటాడు.

ఇదీ చూడండి: బతుకు చిత్రం: నగరం నిద్రపోతున్న వేళ వీధుల్లో విధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.