ETV Bharat / state

వారి త్యాగాల గుర్తింపే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌: భారతి హోలికేరి‌ - ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌ భారతి హోలికేరి

వచ్చే ఏడాది ఆగష్టు నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' వేడుకలను నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. ఎంతోమంది ప్రాణాలర్పిస్తేనే స్వాతంత్య్రం వచ్చిందని.. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కె రన్‌ను ఆమె ప్రారంభించారు.

2K run at the Freedom Fighters' Azadi Ka Amrit Mahotsav programme started by collector bharathi hollikeri
వారి త్యాగాల గుర్తింపే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌: భారతి హోలికేరి
author img

By

Published : Mar 24, 2021, 4:56 PM IST

స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలకు గుర్తుగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్'‌ వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోలికేరి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కె రన్‌ను ఆమె ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్నందున వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఏప్రిల్ 3న కవి సమ్మేళనం ఏర్పాటు నిర్వహిస్తామని తెలిపారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధ స్థాయిల్లో ఫ్రీడం రన్, కవి సమ్మేళనాలు, వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి భారతి హోలికేరి వెల్లడించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల రూపాయలు కేటాయించిందని.. యువత స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు . ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.