గాయంతో కదలలేని స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలిని గమనించి ఓ యువకుడు స్పందించాడు. అటవీ శాఖ అధికారులకు అప్పగించి ప్రాణం నిలిపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. రేకులంపల్లి, వెంకంపల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్టపై గాయంతో కదలలేని స్థితిలో ఉన్న నెమలిని రమేశ్ అనే యువకుడు గమనించాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
అటవీ శాఖ అధికారులు నెమలికి పేరూరు పశు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం దేవరకద్రకు తరలించారు. కొన్నాళ్లు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచి, అనంతరం అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారి మొహమ్మద్ ఏజాజూల్లా తెలిపారు. గాయంతో ఇబ్బంది పడుతున్న నెమలిని చూసి, సకాలంలో స్పందించిన రమేశ్ ను అధికారులు, గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చూడండి: 'వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజీలేని పోరాటం చేస్తాం'