ETV Bharat / state

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో నిలిచిపోయిన రోగ నిర్ధారణ పరీక్షలు - Mahbubnagar Diagnostic issue

Trouble Blood Sample Tests Stalled At T-Hub In Mahbubnagar : మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో రక్త పరీక్షల సేవలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల, రక్త పరీక్షలు చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రక్త నమూన రిపోర్టుల కోసం రోగుల ఎదురు చూడక తప్పడం లేదు. వైద్యులు సమయానికి చికిత్స అందించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

Trouble Blood Sample Tests Stalled At T-Hub In Mahbubnagar
Delayed Diagnostic Tests
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 10:43 AM IST

జనరల్‌ ఆస్పత్రిలో నిలిచిపోయిన రోగ నిర్ధారణ పరీక్షలు

Trouble Blood Sample Tests Stalled At T-Hub In Mahbubnagar : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని టీహబ్‌లో రక్త నమూనా పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే రక్త నమునాలు పరీక్షించేందుకు అప్పట్లో 'టీ హబ్‌'లో రక్త నమూన పరీక్ష యంత్రాలను సమకూర్చారు. నారాయణపేట జిల్లాతో పాటు జిల్లా జనరల్‌ ఆసుపత్రికి సంబంధించిన నమూనాలను డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో పరీక్షంచే వారు. టీహబ్‌లో రక్త పరీక్షలు నిలిచిపోవడంతో అన్ని ఆస్పత్రుల రక్త నమూనాలు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ కేంద్రంలోనే మొత్తం పరీక్షిస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో రక్త పరీక్ష యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి.

Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్​ అంటే ఏమిటి?.. దీనిని నియంత్రించడం సాధ్యమేనా?

"టీహబ్​కు రోజుకు దాదాపుగా 600 -800 రక్త నమునాలు వస్తుంటాయి. మహబూబ్​ నగర్​ నుంచి, నారాయణ పేట నుంచి బ్లెడ్​ సాంపిల్స్​ వస్తాయి. ఆసుపత్రిలో పరికరాలకు లోడ్​ ఎక్కువుతుంది. దాంతో కొన్ని సమస్యలు ఎదురువుతున్నాయి. బ్యాకప్​ సమస్యపై దష్టి సాధిస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించమని పై అధికారులకు సమాచారం అందించాము. లోడ్​ ఎక్కువవుతున్నందుకు ఈ సమస్యలు ఎదురవుతుందని అని పిస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వానికి రిప్రంజెటేషన్​ ఇస్తాం."-డా.జీవన్‌, సుపరింటెండెంట్‌, జిల్లా జనరల్‌ ఆసుపత్రి

Delayed Diagnostic Tests At T-Hub : యంత్రాల్లోని కొన్ని పరికరాలు మరమ్మతులకు గురై సిబ్బంది నిత్యం నరకయాతన పెడుతున్నారు. అసలు ఆ యంత్రాలు ఎప్పుడు పని చేస్తాయో? ఎప్పుడు మొరాయిస్తాయో? తెలియని పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రోజు 350, జనరల్‌ ఆసుపత్రి నుంచి 200, నారాయణపేట జిల్లా నుంచి దాదాపు 400 రక్త నమునాలు నిత్యం వస్తుంటాయి. యంత్రాలు తరచూ మొరాయిస్తుండటంతో సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. సమయానికి రిపోర్టులు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో సరైన విధంగా విద్యుత్తు పనులు చేయకపోవడం కారణంగా సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

'జనాలెవ్వరూ.. ప్రైవేటు ఆస్పత్రి, డయగ్నోస్టిక్​ సెంటర్లకు వెళ్లొద్దు'

"గత సంవత్సరం నుంచే ఐసోలేషన్​ ట్రాన్స్​ ఫార్మర్​ పెట్టాలని అధికారులకు తెలియజేశాం. ప్రభుత్వం మారడం వల్ల ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం జరిగింది. ఈ గవర్నమెంట్ హాయం​లో ఎలక్ట్రికల్​ పనులు ఆసుపత్రిలో చేశాం. నాలుగు సంవత్సరాల నుంచి ఏ సమస్య రాలేదు. భవనం మొదలైనప్పుడు తక్కువ లోడ్​ ఉండటంతో వైరింగ్​ చేశాం. ఇంకా పరికరాలు మిగితా రూం లు 44కేవియల్​ లోడ్​ పెరిగిపోయింది. దీని అనుగుణంగా మార్చాలని సుపరింటెండెంట్‌ కోరాం. ఆయన వాటికోసం అనుమతి తీసుకుంటామని మాతో తెలిపారు. ఆ తరువాత దీన్ని మారుస్తాం."-హరీశ్‌, ఎంఎస్‌ఐడీసీ

ప్రైవేటు సేవలో టీ-హబ్‌.. అక్రమంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు.!

నైట్​ షిఫ్ట్ చేసే మగవారికి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.