మహబూబ్నగర్ జిల్లా పట్టణ అడవుల్లో 12 వేల ఎకరాల్లో విత్తన బంతులను వేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 9 రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి విత్తన బంతులను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వీరన్నపేటలో డ్రోన్ల ద్వారా కోటి విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు.
10 రోజుల్లో కోటి విత్తన బంతులు
మహబూబ్నగర్ జిల్లాను హరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లాలోని 5 వేల 880 మహిళా సంఘాల గ్రూపులు, 69 వేల మంది మహిళలు విత్తనబంతుల తయారీలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వేప, సీమచింత, సీతాఫల్, జువ్వి, రావి, మర్రి, నల్లతుమ్మ సహా 10 రకాల విత్తనాల బంతులు అందుబాటులో ఉంచారు. 10 రోజుల్లో విత్తన బంతులు జల్లే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఆరో విడత హరిత హారంలో భాగంగా కోటి మొక్కలు సహా కోటి విత్తన బంతులు జల్లాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా ఎంచుకుంది.
ఇదీ చూడండి : హైదరాబాద్ ఆస్పత్రుల్లో "నో బెడ్స్" బోర్డులు దేనికి సంకేతం?