పాలమూరు పల్లెల నుంచి పట్టణానికి వలస వెళ్ళిన కూలీలను అక్కడుండే పట్టణ వాసులు స్వగ్రామాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతూ కాలినడకన పల్లెలకు చేరుతున్నా వలస కూలీలకు.. గ్రామ సరిహద్దుల్లోనే ముళ్ల కంపలు అడ్డుపడుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో చుట్టూ సరిహద్దులకు ముళ్ళ కంప వేసి.. తమ గ్రామాలకు ఎవరూ రావద్దని గ్రామస్థులు కాపు కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలస కూలీలు ఎటు పోవాలో పాలుపోక.. రహదారుల వెంట చెట్ల నీడన సేద తీరుతున్నారు. తాగేందుకు నీరు దొరకక, తినేందుకు తిండి దొరకక, ఆకలి దప్పికలను పంటి బిగువున పెట్టుకొని బాధలు అనుభవిస్తున్నట్లు వాపోయారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము