ETV Bharat / state

ఉల్లి రైతు కన్నీటి గాథ... ధరలేక అన్నదాత విలవిల - పడిపోయిన కొత్త ఉల్లి ధర

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో కొత్త ఉల్లి పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పాత ఉల్లి ధర బానే పలుకుతుండగా... కొత్త ఉల్లికి ధరరాక రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొత్త ఉల్లి పండించిన రైతుల పరిస్థితి అయోమయం

author img

By

Published : Sep 9, 2020, 6:29 PM IST

మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా ఉల్లిని సాగుచేసే దేవరకద్ర, చిన్న చింతకుంట మండలాలతో పాటు, నారాయణపేట జిల్లాలోని మక్తల్, ధన్వాడ, నారాయణపేట మండలాల రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం నిర్వహించే వేలం పాటలో విక్రయిస్తుంటారు. విక్రయించగా మిగిలిన ఉల్లిని నిల్వ చేసుకున్న రైతులు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో అమ్ముకుంటారు. వరుస వర్షాలతో భూమిలో పెరిగిన ఉల్లి, పెరిగిన చోటనే మునిగిపోయింది. అక్కడక్కడ కాసింత మిగిలిన ఉల్లి... పూర్తిగా తడిసి పోవడం వల్ల నిల్వ చేసుకునే అవకాశం లేక.. కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక కోసిన ఉల్లి ఆరబెట్టిన చోటనే మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

పాత ఉల్లిని.. క్వింటాకు కనిష్టంగా రూ.1300 నుంచి గరిష్టంగా రూ. 2200 కొనుగోలు చేయగా, కొత్త ఉల్లిని క్వింటాకు రూ .600లకు సైతం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కొత్త ఉల్లి పండించిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.