మహబూబ్‌నగర్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 3 కోట్ల 33 లక్షల 33 వేల 3 వందల 33 రూపాయలతో గర్భగుడిని అలంకరించినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్..!