మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఉన్న అశోక్ లేలాండ్ పరిశ్రమలో నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు చెందిన నాగభూషణం(30), బూత్పూర్ మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన రవి నాయక్.. మెకానిక్‌గా పని చేస్తున్నారు. కంపెనీ పని కోసం దేవరకద్ర మీదుగా నారాయణపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
దేవరకద్ర పెద్ద చెరువు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టగా భూషణ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవి నాయక్ గాయాలతో బయటపడ్డాడు. గాయాలైన రవి నాయక్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు