ETV Bharat / state

ఇల్లూవాకిలీ ఇచ్చేస్తే... ఇప్పుడు వేధిస్తున్నారు! - ఉదండాపూర్ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు

ప్రాజెక్టు కోసం కన్నతల్లిలాంటి ఊళ్లను దూరం చేసుకున్నారు. తమ వాకిట్లో సిరులు కురిపించే పొలాలనూ వదులుకున్నారు. అయినా వారి త్యాగాలు పాలకుల హృదయాలను తాకలేకపోయాయి. అధికారుల మనస్సును కరిగించలేకపోయాయి. సర్కారు హామీతో సర్వం వదులుకున్నా... నేడు పట్టించుకునే వారు లేక పరిహారానికి దూరమయ్యారు. పునరావాసానికి కూడా దిక్కులేక కొట్టుమిట్టాడుతున్న నిర్వాసిత గ్రామాలపై ప్రత్యేక కథనం...

udandapur people protest
ఇల్లూవాకిలీ ఇచ్చేస్తే... ఇప్పుడు వేధిస్తున్నారు!
author img

By

Published : Feb 28, 2020, 7:24 PM IST

ఇల్లూవాకిలీ ఇచ్చేస్తే... ఇప్పుడు వేధిస్తున్నారు!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్‌లో జలాశయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో ప్రకటించిన ఈ ప్రాజెక్టుతో ఖానాపూర్, వల్లూరు, ఉదండపూర్, పోలెపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన 4 వేల 200 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో ఉదండపూర్, వల్లూరు గ్రామాలు పూర్తిగా ముంపులో ఉన్నందున ఇక్కడి ప్రజలు ఇళ్లు, పొలాలు రెండింటినీ కోల్పోవాల్సి వచ్చింది.

వీరందరికి ఎకరానికి సాధారణ వ్యవసాయ భూములకు ఐదున్నర, మాగాణికి ఆరున్నర లక్షల పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు. అలాగే, పక్కనే ఉన్న పోలెపల్లిలో ఎకరానికి 11 లక్షలు చెల్లించారు. ఇళ్లు కోల్పోయిన ఉదండపూర్, వల్లూరువాసులకు ఇంటి స్థలంతోపాటు ఒక్కో కుటుంబానికి 12 లక్షల పరిహారం అందిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు.

నిర్వాసితులకు 70 శాతం పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఖాళీ స్థలాలు కూడా చూపలేదు. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన పరిహారం ప్రస్తుతం దేనికీ సరిపోయే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యమైతే వ్యయం పెంచేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం... తమకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఎందుకు పెంచదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమగోడును పట్టించుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: మళ్లీ కోర్టుకెళ్లిన నిర్భయ దోషి.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.