కేంద్రం ఇటీవలే మంజూరు చేసిన మహబూబ్ నగర్- చించోలి జాతీయ రహదారి నిర్మాణం మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలోని.. ఎర్రమన్నుగుట్ట, హీరాబాయి బంజారాతండా ప్రజలకు నిద్ర పట్టనివ్వడం లేదు. జాతీయ రహదారి విస్తరణ కోసం అక్కడ జరుగుతున్న సర్వే వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాళ్లంతా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన సొమ్మంతా... అక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి ఖర్చు చేశారు.
మేం బీదవాళ్లం.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నాం. రాత్రినక, పగలనక కష్టం చేసి.. కట్టుకున్నాం. మా ఇళ్లు మాత్రం కూల్చొద్దు. మీకు దండం పెడుతాం. ఈ ఇళ్లు పోతాయి అన్నప్పటి నుంచి... గుండె పగిలినం. కూడు అనేది లేదు.. గంజి అనేది లేదు. కారిన కన్నీరు కారుతుంది.
- బాధితురాలి ఆవేదన
సుమారు 130కి పైగా ఇళ్లు జాతీయ రహదారి విస్తరణలో కోల్పోవాల్సి వస్తుందన్న సమాచారం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. సర్వే జరుగుతున్నప్పటి నుంచి... తిండి నిద్ర లేవని ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని చేతులు జోడించి అధికారుల్ని వేడుకుంటున్నారు.
ఈ బైపాస్ అనేది అర కిలోమీటర్ వెళ్తే.. మా భూములు పోవు. ఇప్పుడు 200 ఇళ్లు పోతున్నాయి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇటివలే 35 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. అప్పులయ్యాయి. మాకు పరిహారం వద్దు.. మా ఇల్లు మాకు ఉండనిస్తే చాలు.
- బాధితుల ఆవేదన
మహబూబ్ నగర్- చించోలీ రహదారి నిర్మాణం కోసం ఇటీవలే కేంద్రం 708 కోట్లు మంజూరు చేసింది. డీపీఆర్ సైతం సిద్ధమైంది. తాజా ప్రణాళిక ప్రకారం భూత్పూర్ ఫ్లైఓర్ నుంచి వీరన్నపేట, డంపింగ్ యార్డ్, చిన్నదర్పల్లి మీదుగా కొండగల్ రహదారికి కలుస్తుంది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటున్నతండావాసులు.. తమను రోడ్డు పడేసే ప్రగతి వద్దని సూచిస్తున్నారు. సర్వే పూర్తి కాకముందే.. రోడ్డు ప్రణాళికలో మార్పులు చేయాలని మహబూబ్ నగర్ పట్టణ వాసులు కోరుతున్నారు.
ఇదీచూడండి: