ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 20 మున్సిపల్ పీఠాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 స్థానాలకుగానూ... ఆలంపూర్, వడ్డేపల్లి, అయిజ, వనపర్తి జిల్లా పెబ్బేరు పీఠం ఎస్సీలు రిజర్వ్ అయ్యాయి. ఇక ఉమ్మడి జిల్లాలోని జిల్లా కేంద్రాలైనా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాలతోపాటు మక్తల్, కోస్గి, అమరచింత, కొడంగల్, కొల్లాపూర్ బీసీలు దక్కాయి. కొత్తకోట, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్, భూత్పూర్, కల్వకుర్తి, షాద్నగర్ మున్సిపాలిటీలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ ఎస్టీలకు దక్కింది.
మున్సిపాలిటీ | రిజర్వేషన్ |
మహబూబ్‌నగర్ | బీసీ |
భూత్పూరు | జనరల్ |
నారాయణపేట | బీసీ |
మక్తల్ | బీసీ |
కోస్గి | బీసీ |
వనపర్తి | బీసీ |
పెబ్బేరు | ఎస్సీ |
కొత్తకోట | జనరల్ |
ఆత్మకూర్ | జనరల్ |
అమరచింత | బీసీ |
గద్వాల | బీసీ |
ఆలంపూర్ | ఎస్సీ |
వడ్డేపల్లి | ఎస్సీ |
అయిజ | ఎస్సీ |
నాగర్‌కర్నూల్ | జనరల్ |
కల్వకుర్తి | జనరల్ |
కొల్లాపూర్ | బీసీ |
అచ్చంపేట | జనరల్ |
అమనగల్ | ఎస్టీ |
కొడంగల్ | బీసీ |
ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్‌స్టార్ రజనీ