రాష్ట్రంలో రెండు స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులకు అత్యంత కీలకమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. పీవీ పేరును వాడుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. వాణీదేవి మరో శంకరమ్మ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెరాస అభ్యర్థిని ఎన్నుకోవడం వల్ల పట్టభద్రులకు కలిగే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల పేరుతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
మూడు నెలల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..
రాష్ట్రంలో 4వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని... 7500 మంది క్షేత్ర సహాయకులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం మూడు నెలల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తెరాస పతనం ప్రారంభమైందన్నారు. సమర్థులను ఎన్నుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుంది: దాసోజు